బాలీవుడ్ లో స్టార్ కపుల్.. అంటే వెంటనే గుర్తుకు వచ్చేవారిలో... రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఈ జంట ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ తో భేటీ అయ్యారు. కారణం ఏంటంటే..?  

బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా..దూసుకుపోతున్నారు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్. అప్పుడప్పుడు ఏదో ఒక ఇష్యూలో హాట్ టాపిక్ అవుతుంటారు 
తాజాగా మరోసారి రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ వార్తల్లో నిలిచారు. అది కూడా తమ ఫీల్డ్ కు ఏమాత్రం సంబంధం లేని స్టార్ క్రికెటర్ తో కలిసి.. అది కూడా పక్క దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చి వైరల్ అయ్యారు. 

ఆప్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అంటే క్రికెట్ అభిమానులకు పరిచయమే. గుజరాత్ టైటాన్స్ బౌలర్ అని చెప్పితే వెంటనే గుర్తు పడతారు ఆడియన్స్. ఈ స్టార్ క్రికెటర్ ను బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ కలుసుకున్నారు. రణబీర్ కపూర్ దంపతులు తమ కుమార్తె రాహతో కలసి అమెరికా పర్యటనలో ఉన్నారు. కొన్ని వారాలుగా న్యూయార్క్ పర్యటనలో ఉన్నారు స్టార్లు. అయితే ప్రస్తుతం న్యూయార్క్ లోనే ఉన్న రషీద్ ఖాన్ ను వీరు కలుసుకున్నారు.

 ఇందుకు సంబంధించిన ఫొటోని రషీద్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. రషీద్ ఖాన్ మధ్యలో ఉండగా, కుడి వైపున అలియా భట్, ఎడమవైపు రణబీర్ కపూర్ నించున్నారు. రషీద్ ఖాన్ భుజంపై రణబీర్ చేయి వేసి, మరో చేయి చూపుడు వేలును రషీద్ వైపు చూపిస్తున్నట్టు ఫొటోలో ఉంది. ఇందులో రషీద్ ఖాన్, అలియా భట్ ఇద్దరూ నల్లటి టీ షర్టుల్లో ఉంటే, రణబీర్ గ్రే కలర్ టీ షర్ట్ తో కనిపిస్తున్నాడు. రణబీర్ కపూర్ దంపతులు న్యూయార్క్ పర్యటనను పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు.

ఇక ప్రస్తుతం అమెరికాలో తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా భట్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో శేర్ చేసింది. రషీద్ ఖాన్ తో అలియా భట్, రణబీర్ భేటీ ఫొటో చూసిన అభిమానులు వరుస కామెంట్లతో తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.