సొట్ట బుగ్గల సుందరి అలియా భట్ ని వరుసగా క్రేజీ చిత్రాలు వరిస్తున్నాయి. వందల కోట్ల బిజినెస్ చేసే చిత్రాల్లో అలియా కథానాయికగా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన 'ఇన్షా అల్లా',బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ సరసన, ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది. 

సల్మాన్ నటించబోతున్న ఇన్షా అల్లా చిత్రానికి స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఈ చిత్రంలో అవకాశం దక్కడంపై అలియా భట్ తాజాగా స్పందించింది. ఈ చిత్రం కోసం భన్సాలీ తనని సంప్రదించినప్పుడు తాను విదేశాల్లో ఉన్నానని అలియా తెలిపింది. ఈ చిత్రం కోసం భన్సాలీ ఫోన్ చేయగానే సంతోషంతో ఎగిరి గంతులేశా. ఈ చిత్రంలో నటించమని అడగానే దాదాపు 5 నిమిషాల పాటు పైకి కిందకు ఎగుతూనే ఉన్నా. 

కథ నాకు చాలా బాగా నచ్చింది. ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయా అని అలియాభట్ తెలిపింది. ఇక తొలి సారి అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది.