దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమాను మొదలెడుతున్నాడు అంటే ఆ సినిమాలో  నటించే పాత్రల గురించి కొంచెమైనా తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే జక్కన్న యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఓ రేంజ్ ని చూపిస్తున్నాడు కాబట్టి. బాహుబలి అనంతరం బాలీవుడ్ సెలబ్రేటిలు సైతం జక్కన్న వైపు ఆశగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. 

అయితే సినిమాలో నటిస్తోన్న అలియా భట్ కి RRRలో అవకాశం ఎలా వచ్చిందంటే.. అమ్మడు ఈ బడా మల్టీస్టారర్ ఎనౌన్స్మెంట్ రాకముందు నుంచే ఎదో ఒక విధంగా రాజమౌళితో వర్క చేయాలనీ అనుకుందట. ఒకరోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో రాజమౌళిని అనుకోకుండా కలిసిన అలియా వెంటనే నెక్స్ట్ సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చెప్పండని అందట. 

ఎంత బిజీ షెడ్యూల్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకొని మరి డేట్స్ ఇవ్వగలను అని అలియా తన బలాన్నిమొత్తం ఉపయోగించి జక్కన్నను ఎదో రకంగా మెల్ట్ చేసిందట. అయితే ఆమెను దర్శకుడు ముందే సెలెక్ట్ చేసుకున్నాడా లేక అలియా బ్రతిమాలుకున్నందుకు అవకాశం ఇచ్చాడా అన్న విషయం ఆయనకే తెలియాలి.

మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్ రాజమౌళి సినిమాలో మెయిన్ కథానాయికగా సెలెక్ట్ అవ్వడంతో తన కల చాలా స్పీడ్ గా నిజమవుతోందని సినిమాలో సీత పాత్ర కోసం తాను తెలుగు కూడా నేర్చుకుంటున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా వివరించింది.