ఆదివారం జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ హౌస్ మేట్స్ తో పాటు, ఆడియన్స్ కి కూడా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా భావిస్తున్న అలీ రెజా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఇంటి సభ్యులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఈ సీజన్ లో ప్రతి టాస్క్ లో అలీ బలమైన పోటీ ఇస్తూ వస్తున్నాడు. కాస్త అగ్రసివ్ గా ఉంటున్నా, అతడిపై విమర్శలు ఉన్నా అవి అలీకి పెద్ద సమస్య కాదని అంతా భావించారు. కేవలం సంచలనం కోసమే అలీని ఎలిమినేట్ చేశారా లేక అతడికి నిజంగానే ఓటింగ్ తగ్గిందా అనే ప్రశ్నలు ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. 

అలీ ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ షోపై ఆసక్తిని తగ్గగించే చర్యే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అలీ ఎలిమినేషన్ లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అలికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. 

50 రోజులు పూర్తయిన సందర్భంగా సెన్సేషన్ కోసం అలీని ఎలిమినేట్ చేశారని.. త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి అతడి రీఎంట్రీ ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున ఎలిమినేషన్ జరిగిన ప్రతి సారి బయటకు వెళ్లే సభ్యుడిని ఓ ప్రశ్న అడుగుతున్నారు. బిగ్ బాస్ లో మళ్లీ పాల్గొనే అవకాశం వస్తే చేస్తావా అని అందరిని ప్రశ్నిస్తున్నాడు. అలీని కూడా ఆ ప్రశ్న అడిగాడు. 

మరికొన్ని రోజుల్లో ఓటింగ్ పద్దతి ద్వారా ఎలిమినేట్ అయిన ఇద్దరు సభ్యులకు బిగ్ బాస్ లో మళ్ళీ పాల్గొనే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ నుంచి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషు రెడ్డి, అలీ ఎలిమినేట్ అయ్యారు. జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందొ వేచి చూడాలి. 

బిగ్ బాస్ 3: అలీ రెజా ఎలిమినేషన్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన హౌస్ మేట్స్!