మొన్న సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్‌2’. వెంకటేష్, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం వచ్చిన క్రేజ్ ని ఓ హాలీవుడ్ చిత్రం తమ ప్రమోషన్ కు వాడుకుంటోంది. ఇక్కడ లోకల్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి ‘ఎఫ్‌2’హీరోలు ఇద్దరు చేతా ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. వెంకీ, వరుణ్ తేజ అభిమానులు ఈ టీజర్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. వివరాల్లోకి వెళితే..

గాయ్‌ రిట్చయ్‌ డైరక్షన్ లో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అల్లాదిన్‌’. ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది. ఈ సినిమా కోసం ఎఫ్ 2 హీరోలు వెంకీ, వరుణ్ తేజ్ లు వాయిస్ ఓవర్ అందించారు.

జీనికి వెంకటేష్‌ వాయిస్ ఇవ్వగా, అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ‘ఎఫ్‌2’లో అలరించిన వీరిద్దరూ జీనీ-అల్లాదిన్‌ వాయిస్‌లతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొచ్చారు. ‘అల్లాదిన్‌’ మే 24 విడుదలకానుంది. 

అల్లాదిన్ కథ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ కథాంశంతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.