స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన  మూడవ సూపర్ హిట్ చిత్రం “అల వైకుంఠపురములో”. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మొదట్లో  సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన ప్రతీచోట మంచి కలెక్షన్స్ తెచ్చుకుని, లాక్ డౌన్ ముందు దాకా చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడింది. అలాగే తమన్ అందించిన పాటలు ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసాయి. కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం టీవీలో ప్రసారం చేసారు.మొదటి సారి ప్రసారం జరిగినప్పుడు  ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు  కొట్టింది. దాదాపు 30 పాయింట్ల రేటింగ్ వచ్చింది. అది ఆల్ టైం రికార్డు. 

ఆ స్దాయి రేటింగ్ వచ్చిన సినిమాకి రెండోసారి ప్రసారం చేస్తే అందులో సగమైనా వస్తుందని ఎక్సపెక్ట్ చేస్తారు. కానీ చిత్రంగా సీన్ రివర్స్ అయ్యింది. మొన్న దీపావళి పండగకి రెండోసారి ప్రసారం చేస్తే.. కేవలం 7.93 రేటింగ్ మాత్రమే వచ్చింది. అంటే ప్రీమియర్ కి వచ్చిన రేటింగ్ కు దగ్గరగా రాకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
ఇక అల్లు అర్జున్ కు నార్త్,సౌత్ అనే తేడా లేకుండా ఉన్న క్రేజ్ ని ఈ సినిమా ఎలివేట్ చేసింది. తెలుగు రాని వాళ్లు సైతం సబ్ టైటిల్స్ లో ఈ సినిమాని చూసి  నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో నెట్ ప్లిక్స్ కు తెలుగు వాళ్లు చాలా మంది చందా దారులు అవుతున్నారు.  యూఎస్ అభిమానులకు కూడా నెట్ ఫ్లిక్స్ లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా చూస్తూనే ఉన్నారు.