స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో..' అయితే సినిమాకు సంబందించిన బిజినెస్ డీల్స్ ను నిర్మతలు త్వరత్వరగా క్లోజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఎలాంటి మార్కెట్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్లాప్ సినిమాలు కూడా ప్రీమియర్స్ తో మిలియన్ల డాలర్స్ ని అందుకున్నాయి. 

అందులోను స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండడంతో సినిమాపై ఓవర్సీస్ లో కూడా అంచనాల డోస్ పెరుగుతోంది. ఇక ఇప్పుడు ఆ మార్కెట్ లో సినిమా కి మంచి ధర పలికినట్లు సమాచారం. 8.5కోట్లకు నిర్మాతలు యుఎస్ సినిమా రైట్స్ ని అమ్మినట్లు సమాచారం. హారికా హాసిని - గీత ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత పేతురేజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక థమన్ ప్రస్తుతం సినిమాకు ట్యూన్స్ సెట్ చేసే పనిలో బిజీగా ఉంన్నాడు. త్వరలో ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.