Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే రేటుకు ‘అల వైకుంఠపురంలో’ ఓవర్సీస్‌ రైట్స్

అల్లు అర్జున్ సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక త్రివిక్రమ్ సినిమాలకు అయితే చెప్పక్కర్లేదు. మాస్ సినిమాలు కన్నా క్లాస్ సినిమాలకు ఓటేసే ఓవర్ సీస్ జనం...ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ కోసం పోటీలు పడ్డారు. ఎవరూ ఊహించని రేటుకు ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఎంత పెట్టారు..ఎవరు తీసుకున్నారు.
 

Ala Vaikuntapuramulo Overseas rights sold out for fancy price
Author
Hyderabad, First Published Sep 25, 2019, 7:57 AM IST

‘అల వైకుంఠపురంలో’ సెటప్ చూస్తుంటే అచ్చమైన తెలుగు సినిమా అని అర్దమవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.  త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమా తీస్తే చూడాలని ఎదురుచూసే కళ్లకు ఇది పండగే.  దాంతో భాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్  జరుగుతుందని ‘అల వైకుంఠపురంలో’ ని  8.56 కోట్లకు ఔట్ రేట్ చేసి, నలభై వేలు రికవరబుల్ అడ్వాన్స్ కలిపి మొత్తం  తొమ్మిది కోట్లకు ఇచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు ఏవీ ఓవర్ సీస్ లో పే చెయ్యటం లేదు. అంతా లాస్ కనిపిస్తోంది. అయినా సరే రిస్క్ చేసి ఈ సినిమాని మంచి రేటు పెట్టి తీసుకున్నారు. బ్లూ స్కయ్ సంస్థకు ఈ హక్కులు దొరికాయి.

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో.  ఈ సినిమా  షూటింగ్ ని జెట్ స్పీడ్ తో పరుగెట్టిస్తున్నారు త్రివిక్రమ్. కొద్దిరోజుల క్రితం కాకినాడ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిపిన చిత్ర యూనిట్, ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టూడియాలో వేసిన ఖరీదైన సెట్ లో షూటింగ్ చేసింది.  తాజా వార్త ప్రకారం వచ్చేనెల మొదటివారంలో అలవైకుంఠపురంలో టీం తమ నెక్స్ట్ షెడ్యూల్ కొరకు ప్యారిస్ వెళ్లనున్నారని సమాచారం.

ప్యారిస్ లో  కొన్ని కీలక సన్నివేశాలలో పాటు పాటల షూటింగ్ జరపాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసారట. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తుండగా, హీరో సుశాంత్,నివేదా పేతురాజ్, నవదీప్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి సాలిడ్‌ హిట్‌ లేదు. అందుకే ఏడాది గ్యాప్‌ తీసుకున్నాడు. ఐనా బన్నికి క్రేజ్‌ ఇంచ్‌ కూడా తగ్గలేదు. ఇక త్రివిక్రమ్‌..త్రివిక్రమే. హిట్స్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేని ఇమేజ్‌ ఆయనది. ముఖ్యంగా ఓవర్సీస్‌ మార్కెట్లో త్రివిక్రమ్‌ సినిమాలకుండే క్రేజే వేరు. నితిన్‌ వంటి హీరోతో కూడా ఆయన 2.5 మిలియన్‌ డాలర్ల ("అ ఆ")  బ్లాక్‌బస్టర్‌ అందించిన స్టార్‌డైరక్టర్‌ ఆయన. రీసెంట్‌గా ఎన్టీఆర్‌తో తీసిన "అరవింద సమేత" కూడా టూ మిలియన్‌ డాలర్ల మార్క్‌ని దాటింది.

మరి అలాంటి టాప్‌ డైరక్టర్‌ బన్నితో ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌ తీస్తుంటే...ఓవర్సీస్‌ బయ్యర్లు ఎగబడకుండా ఉంటారా? ఈ సినిమా ఓవర్సీస్‌ బిజినెస్‌ అపుడే క్లోజ్‌ అయింది. బ్లూస్కై సంస్థ ఈ మూవీ రైట్స్‌ని ఎనిమిదిన్నర కోట్లకి కొనుగోలు చేసింది. అంటే సూపర్‌ రేట్‌. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. పొంగల్‌ పోటీలో కింగ్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ అనిపించుకున్న మహేష్‌బాబు మూవీ "సరిలేరు నీకెవ్వరు" కూడా విడుదల అవుతోంది. రజనీకాంత్‌ నటిస్తోన్న "దర్బార్‌" కూడా పోటీలో ఉంది. ఇంత స్టిప్‌ కాంపిటీషన్‌లో "అల వైకుంఠపురంలో" రిలీజ్‌ కానుంది. ఐనా ఇంత మంచి ప్రైస్‌ రావడం విశేషం.

అది త్రివిక్రమ్‌ సత్తా. ఇక బన్ని, త్రివిక్రమ్‌లది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. ఇంతకుముందు వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు కూడా అప్పటికి మంచి గ్రాసర్స్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios