మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ ప్రాజెక్ట్ అల వైకుంఠపురములో షూటింగ్  హైదరాబద్ లో శరవేగంగా సాగుతోంది. సినిమా కోసం నిర్మించిన 5కోట్ల స్పెషల్ సెట్ లో దర్శకుడు కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 

అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ ని దసరా నుంచే పెంచాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. సంక్రాంతికి అల వైకుంఠపురములోవిడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ సినిమ టీజర్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చెయ్యాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా సినిమా టీజర్ తెలుగు మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు టాక్. 

జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు భారీ డీలింగ్స్ తో సెట్టయినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ - చినబాబు ఈ సినిమాను వారి బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.