గతంలో 'ఇంద్ర', 'నరసింహనాయుడు' వంటి సినిమాలకు రచయితగా పని చేసిన చిన్నకృష్ణ ఆ తరువాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించింది లేదు. అతడు ఆఖరిగా కథ అందించిన  చిత్రం 'జీనియస్'. ఆ తరువాత తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.

తాజాగా ఈ రచయిత ప్రెస్ మీట్ పెట్టి మెగాఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు. దీంతో చిన్ని కృష్ణపై యుద్ధం ప్రకటించాడు మరో రచయిత ఆకుల శివ. చిన్న కృష్ణ మోసగాడని, చాలా మంది రైటర్ల నుండి ఐడియాలను, కథలను దొంగిలించాడని.. అతడిపై చీటింగ్ కేసులు చాలానే ఉన్నాయని తెలిపాడు.

తారా చౌదరితో సహా చాలా మంది మహిళలను అతడు మోసం చేశాడని ఆరోపణలు చేశారు. మరోసారి మెగాఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ జాతకం బయట పెడతా అంటూ చిన్ని కృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు.

తాను దర్శకుడిని కాకుండా అడ్డుకున్నది కూడా చిన్ని కృష్ణే అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు ఆకుల శివ ప్రకటించాడు. ఇప్పుడు ఈ వీడియో కోసం పవన్ ఫ్యాన్స్ తో సహా అందరూ ఎదురుచూస్తున్నారు.