సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన జరిగింది. బాలీవుట్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెయిర్ స్టైలిష్ట్ కన్నుమూశారు. కొన్నేండ్ల నుంచి అక్షయ్ కుమార్ వద్దే పనిచేసి  తుదిశ్వాస విడవటంతో భావోద్వేగమయ్యారు.  

చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హెయిర్ డ్రెస్సర్, సీనియర్ హెయిర్ స్టైలిష్ట్ మిలన్ జాదవ్ (Milan Jadhav) కన్నుమూశారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికన భావోద్వేగభరితమైన పోస్ట్‌ పెట్టాడు. మిలన్ జాదవ్ తో కలిసి ఉన్న త్రోబాక్ ఫొటోను పంచుకున్నాడు. అలాగే ఎమోషనల్ నోట్ కూడా రాశారు. 

మిలన్ జాదవ్ అక్షయ్ కుమర్ వద్ద 15 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నాడు. ‘మిలన్ జాదవ్.. ఆయన చెరిపేసినట్టు ఉండే హెయిర్ స్టైల్ మరియు చిరునవ్వుతో గుంపుకు దూరంగా ఉండేవారు. ఎల్లప్పుడూ నా హెయిర్ ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనకంటూ ప్రత్యేక స్థలం లేదు. సెట్ లోనే జీవితం గడిపాడు. 15 సంవత్సరాలకు పైగా నాకు హెయిర్ స్టైలిష్ట్ గా పనిచేశారు మిలన్ జాదవ్. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ నోట్ లో పేర్కొన్నారు. అయితే అక్షయ్ కుమార్ పోస్టుకు పలువురు స్పందిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ, మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, రూపాలీ గంగూలీ సంతాపం వ్యక్తం చేశారు.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీ షెడ్యూల్‌ను లీడ్ చేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు చిత్రాలలో నటించాడు. అందులో ‘పృథ్వీరాజ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ‘బచ్చన్ పాండే’తోనూ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘కట్‌పుట్ల్లి’తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. తదుపరి ‘రామ్ సేతు’,‘బడే మియా చోటే మియా’, ‘సూరారైపోట్రు’లో నటిస్తున్నారు. 

View post on Instagram