బాలీవుడ్ స్టార్ హీరోగా.. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్.. తన మంచి మనసు కూడా చాటుకున్నారు. నష్టాల్లో ఉన్న టీమ్ ను కాపాడటం కోసం కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ ను వదలుకున్నాడు బాలీవుడ్ హీరో.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలా మంచివాడనే పేరే ఉంది. దానికి తగ్గట్టుగానే.. ఆయన నీతిగా నిజాయితీగా ఉంటూ.. టాక్స్ లు కరెక్ట్ గా కడుతూ.. ఉపద్రవాలు వచ్చినప్పుడు కోట్లు కూడా లెక్క చేయకుండా సాయం చేస్తుంటాడు.. ఆమధ్య బాధితులకు ఆయన ఏకంగా 25 కోట్లు ప్రకటించాడు. అది ఆయన మంచి తనం. బాలీవుడ్ లో అతి తక్కువ కాంట్రవర్శీల్లో ఉన్న హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. మోన్నటి వరకూ కెనడా పౌరసత్వం ఉన్నా.. ఇండియా పట్ట.. తన ఫ్యామిల పట్ల చాలా బాధ్యతగా ఉన్నాడు. అలానే ప్రవర్తించాడు బాలీవుడ్ హీరో. అలాంటి అక్షయ్ కుమార్ తన మంచి మనసుతో కోట్ల రూపాయలను వదిలేసుకున్నాడుట. ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా అక్షయ్ కుమార్ సినిమా ఓమైగాడ్ 2 సూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు అక్షయ్ కుమార్ ఈ మధ్యనే తమ భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించాడు అక్షయ్. ఈ వార్త వైరల్ అవుతున్న టైమ్ లోనే.. అతని గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథూర్ తన ఆటో బయోగ్రఫీ పిచ్ సైడ్:మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే పుస్తకంలో అక్షయ్ మంచి తనం గురించి ప్రస్తావించారు. కాంట్రాక్ట్ మధ్యలోనే వదిలేసి భారీ మొత్తాన్ని కూడా లెక్క చేయని అక్షయ్ ప్రవర్తన తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మాథుర్ అందులో రాశారు.
అసలు ఏమైందంటే...ఐపీఎల్...కొన్నేళ్ళుగా క్రికెట్ ను ఏలుతోంది. ఇందులో ఆడటానికి ఇంట్రస్ట్ చూపించని ఆటగాడు ఉండడు. డబ్బులు కూడా చాలా భారీగానే వస్తాయి. ఇందులో ఫ్రాంచైజీలు ఉండడమూ...దానికి సినిమా స్టార్లు ఓనర్లుగా ఉండడం మొదటి నుంచి వస్తూనే ఉంది. ప్రీతిజింటా, షారూఖ్, జుహీ చావ్లా లాంటి వాళ్ళు ఫ్రాంఛైజీ ఓనర్లుగా ఉన్నారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఒక ఓనర్ గా ఉండేవాడుట. అయితే ఐపీఎల్ లో ఎంత లాభాలు వస్తాయో...అంతే బారీగా నష్టాలు కూడా వస్తాయి. 2009లో ఢిల్లీ డెవిల్స్ నష్టాల బాటలో ఉంది. అప్పుడు అక్షయ్ కుమార్ తాను ఆ ఫ్రాంచైజీతో చేసుకున్న 3 ఏళ్ళ ఒప్పందాన్ని వదిలేసుకోవాల్సి వచ్చిందట.
ప్రమోషన్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు కావడం లాంటి వాటితో కూడాన కాంట్రాక్ట్ ను అక్షయ్ తో డీడీ చేసుకుంది. అయితే నష్టాలు రావడంతో కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావించింది. దాంతో అక్షయ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవాలని భావించిందిడీడీ. అయితే న్యాయపరంగా అదంత సులువైన విషయం కాదు. కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నా అక్షయ్ కు భారీ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైమ్ లో అక్షయ్ తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకుని కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారుట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
