. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగుతోంది.

ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చాక బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లోనూ, అలాగే ఇక్కడ సౌత్ స్టార్స్ బాలీవుడ్ చిత్రాల్లోనూ కనపడటం మొదలైంది. మార్కెట్ విస్తృతి పెరగాలంటే తప్పనిసరిగా అన్ని భాషల స్టార్స్ ఒకే సినిమాలో కనపడాల్సిన అవసరం ఏర్పడింది. చాలా పెద్ద సినిమాలు ఇదే స్ట్రాటజీ ఫాలో అవటం మొదలైంది. ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సైతం ఇదే పద్దతిని ఫాలో అవుతోంది.

‘జిన్నా’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న మంచు విష్ణు తన డ్రీమ్‌ప్రాజెక్టు భక్త కన్నప్పను ప్రారంభించి రెగ్యులర్ షూట్ లో బిజీగా ఉన్నారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శక‌త్వం చేస్తుండ‌గా , సీనియర్‌ రచయితలు పరుచూరి, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగుతోంది.

అలాగే ప్రతీ ఇండస్ట్రీలోని ఓ స్టార్ ఈ కన్నప్ప సినిమాలో పాలు పంచుకునేలా ప్లాన్ చేసారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళం నుంచి విలక్షణ నటుడు శరత్ కుమార్ వంటి వారంతా కన్నప్పలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా, న‌య‌న‌తార పార్వ‌తిగా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సైతం ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. వీళ్లందరితో పాటు ఇప్పుడు మరో స్టార్ తెరపైకి వచ్చారు. ఆయన మరెవరోకాదు అక్షయ్ కుమార్.

 ఈ సినిమాలో బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్యాన్ ఇండియా సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్స్‌ను తన సినిమాలో నటింపచేస్తే.. మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నారట. అందులో భాగంగా ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్, అక్షయ్ కుమార్ ఒకే సినిమాలో నటిస్తూండటంతో ఆ ప్రాజెక్టు ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.