'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ప్రభాస్. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన అదే రేంజ్ లో తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకుంటున్నాడు. దీంతో ఆయన సినిమాలకు పోటీగా మరో సినిమా రావడానికి సాహసించడం లేదు.

బాలీవుడ్ వాళ్లకు కూడా భయపడాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో ఆరోజున మరే సినిమాలు రావడం లేదు.

బాలీవుడ్ లో కూడా 'బాట్లా హౌస్' అనే సినిమా డేట్ మార్చుకుంది. అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ మంగళ్' సినిమా కూడా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది. 'సాహో' సినిమా టీజర్ చూసిన తరువాత 'మిషన్ మంగళ్' చిత్రబృందం భయపడిందనే వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. ఆగస్ట్ 15న 'మిషన్ మంగళ్'  సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అక్షయ్ ఓ పోస్ట్ పెట్టాడు.

అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటామని.. ఇండియాలో అలా ఇన్స్పైర్ చేసే స్థాయి సినిమా ఇదేనని తన సినిమాను తెగ పొగిడేసుకున్నాడు. అక్షయ్ కుమార్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 'సాహో' సినిమా ఎఫెక్ట్ తమ మీద పడే ఛాన్సే లేదన్నట్లుగా ఉన్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!