బాలీవుడ్ లో మన దర్శకులకు ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి మరీ వెళ్లి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. హిందీలో సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని తహతహలాడుతుంటారు. అయితే అక్కడి స్టార్లమన దర్శకులకు అంత సీన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

స్టార్ డైరెక్టర్స్ తప్ప మిగిలిన దర్శకులు ఎవరు డైరెక్ట్ చేసినా.. బాలీవుడ్ స్టార్లు డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో తలదూరుస్తుంటారు. కంగనా నటించిన 'మణికర్ణిక' సినిమా విషయంలో దర్శకుడు క్రిష్ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను తీసిన సీన్లను తనకు కావల్సినట్లుగా తీసుకొని, కొంత ప్యాచ్ వర్క్ పూర్తి చేసి డైరెక్టర్ గా క్రెడిట్ తీసుకోవడమే కాదు.. దర్శకుడు క్రిష్ ని ఎంతో తక్కువ చేసి మాట్లాడింది.

ఇప్పుడు దర్శకుడు లారెన్స్ కి కూడా బాలీవుడ్ లో చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ తనకు ఛాన్స్ ఇవ్వడంతో తన ప్రతిభ చూసి ఇచ్చారనుకున్నాడు లారెన్స్. కానీ తనను లెక్క చేయడం లేదని ఎప్పుడు అర్ధమైందో.. వెంటనే ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చేశాడు.

అయితే ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ కానీ, నిర్మాతలు కానీ ఎంత మాత్రం పట్టించుకోలేదు. దీని బట్టి చూస్తేనే అర్ధమవుతుంది సౌత్ డైరెక్టర్లకు బాలీవుడ్ స్టార్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో.. ఇకనైనా మన దర్శకులు బాలీవుడ్ ఆఫర్లు వస్తే.. ఆలోచించుకొని వెళ్లాలని సినీ ప్రముఖులు సూచిస్తున్నారు.