అక్షయ్ కుమార్ అదరగొట్టాడు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో దడదడలాడించాడు. ఎప్పుడూ కమర్షియల్ ట్రెండీ ఫిల్మ్స్ చేసే అక్షయ్.. ఈసారి హిస్టారికల్ క్యారెక్టర్ లో దుమ్మురేపాడు. ఆయన నటించిన పృథ్వీరాజ్ ట్రైలర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. 

అక్షయ్ కుమార్ అదరగొట్టాడు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో దడదడలాడించాడు. ఎప్పుడూ కమర్షియల్ ట్రెండీ ఫిల్మ్స్ చేసే అక్షయ్.. ఈసారి హిస్టారికల్ క్యారెక్టర్ లో దుమ్మురేపాడు. ఆయన నటించిన పృథ్వీరాజ్ ట్రైలర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చారిత్రాత్మక సినిమా పృథ్వీరాజ్. 12వ శతాబ్దంలో భారతదేశపు చక్రవర్తుల్లో ఒకరైన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈసినిమా కరోనా వల్ల డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

పృథ్వీరాజ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3 న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేకర్స్. ఈ మూవీ తెలుగు తమిళ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు టీమ్. 

YouTube video player

 ఇది ఉత్తరాధికారి బంధు రీత్యా కాదు.. యోగ్యతతో ఎంచుకోబడతారు.. అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. శౌర్యానికి వీరత్వానికి ప్రతీక అయిన పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత శత్రువుల నుంచి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఢిల్లీపై 17 సార్లు దండెత్తిన మహ్మద్ ఘోరీకి ఎదురు నిలిచి ఎలా తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు.. లాంటి విషయాలతో పాటు .. ఆయన లవ్ స్టోరీని కూడా ఆడ్ చేసి ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించారు. 2017 మిస్ ఇండియాగా నిలిచిన మానుషీకి ఇది డెబ్యూ మూవీ. సంజయ్ దత్ - సోనూ సూద్ - అశుతోష్ రానా - మానవ్ విజ్ - సాక్షి తణ్వార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీ సెట్స్ - వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు - వీరోచిత పోరాటాలతో భారీతనం కనిపిస్తుంది సినిమాలో.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ - ఎహసాన్ - లాయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. భారీ అంచనాలు.. భారీ కలెక్షన్స్ లక్ష్యంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి.