బాలీవుడ్ మొత్తం మొన్న రిలీజై ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ దెబ్బకు దక్షిణాది వైపు చూస్తోంది. సొంతంగా స్క్రిుప్టు రాసుకుని తెరకెక్కించటం కన్నా సౌత్ నుంచి హిట్టైన సినిమా తీసుకుని రీమేక్ చేసుకుంటే బాగుంటుందనే నిర్ణయా నికి హీరోలు వచ్చేసారు. మినిమం గ్యారెంటీ సినిమాలుగా ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ అదే పద్దతి ఫాలో అవుతున్నారు. 

వ‌రుస స‌క్సెస్‌ల‌తో బాక్సాఫీస్ వద్ద స‌త్తా చాటుతున్న బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్. రీసెంట్‌గా  పవన్ హీరోగా నటించిన కాటమరాయుడు ( `వీర‌మ్‌` )చిత్రాన్ని `బ‌చ్చ‌న్ పాండ్య‌న్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు మ‌రో  తెలుగు సినిమా రీమేక్ కు సై అన్నారు.  చిరంజీవి నటించగా హిట్టైన ఖైదీ నెంబర్ 150 సినిమా కు అక్షయ్‌ కుమార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని బాలీవుడ్ అంటోంది. 

వివ‌రాల్లోకెళ్తే.. విజ‌య్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం `క‌త్తి`. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో వివి వినాయిక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 టైటిల్ తో రీమేక్ చేసారు. ఇప్పుడా చిత్రాన్ని  హిందీలో వ‌యాకామ్ స్టూడియోస్ రీమేక్ చేయ‌నుంది. అక్షయ్‌కుమార్‌తో `మిష‌న్ మంగ‌ల్‌` సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు జ‌గ‌న్ శ‌క్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. గ‌తంలోనూ విజ‌య్‌. మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన `తుపాకి` చిత్రాన్ని `హాలీడే` పేరుతో రీమేక్ చేయ‌గా.. అందులోనూ అక్షయ్‌కుమారే హీరోగా న‌టించారు.