యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సాహసాలకు పెట్టింది పేరు. సినిమా కోసం అతడు ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాడు. అక్షయ్ కుమార్ ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుంటాడు. తాను కమిటైన సినిమా కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టేస్తానని అక్షయ్ కుమార్ మరో సారి నిరూపించాడు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ కి జోడిగా కత్రినా నటిస్తోంది. 

అక్షయ్ కుమార్ తాజాగా సోషల్ మీడియాలో సూర్యవంశీ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ లో షేర్ చేశాడు. ఇందులో అక్షయ్ కుమార్ చేస్తున్న యాక్షన్ స్టంట్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. అక్షయ్ కుమార్ హెలికాఫ్టర్ కు వేలాడుతూ విలన్ ని వేటాడుతున్న దృశ్యం ఇది. ఈ స్టంట్ ని చాలా సింపుల్ గా చేశా. మీరు మాత్రం ఇలాంటి సాహసాలు చేయవద్దు. అని యాక్షన్ స్టంట్స్ నిపుణుల ఆధ్వర్యంలో చిత్రీకరిస్తాం అంటూ అక్షయ్ కుమార్ అభిమానులని హెచ్చరించాడు. 

ఇలాంటి యాక్షన్ స్టంట్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రాణాలకే రిస్క్. ఎక్కువగా హాలీవుడ్ నటులు హెలికాఫ్టర్ సన్నివేశాలలో ఎలాంటి డూప్ లేకుండా నటిస్తుంటారు. అలాంటి సాహసోపేతమైన హీరో అక్షయ్ కుమార్ రూపంలో మనకు కూడా ఉన్నాడు. సూర్యవంశీ చిత్రాన్ని 2020 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.