బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ తాజాగా చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. మీడియాలో డిస్కషన్ పాయింట్ అయ్యాయి. ఇంతకీ అక్షయ్ కుమార్ చేసిన ఆ కామెంట్స్ ఏమిటి...అంతలా జనం రియాక్ట్ అవటానికి కారణం ఏమిటి చూద్దాం.
 
ఇంతకీ బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన విషయం...తను రోజూ గోమూత్రం తాగుతారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో హీరోయిన్ హ్యూమా ఖురేషి అడిగిన ప్రశ్నకు అక్షయ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘మ్యాన్ వర్సెస్ విల్డ్’ అనే ప్రోగ్రాం పాల్గొన్నారు. బందిపూర్ నేషనల్ పార్క్‌ అండ్ టైగర్ రిజర్వ్‌లో చిత్రించిన ఈ ప్ర్యతేక ప్రోగ్రాంలో భాగంగా ఏనుగు పూప్‌తో చేసిన టీని అక్షయ్ తాగారు. ఆ మధ్య ఇది చాలా వైరల్‌గా మారింది. ఇదే విషయాన్ని ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో హ్యూమా ఖురేషి అడిగారు.

‘‘ఇది నాకు కొత్తేం కాదు. నేను ప్రతి రోజు గోమూత్రం తాగుతాను. గోమూత్రంలో అనేక ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి’’ అని అక్షయ్ సమాధానం చెప్పారు. ఇక అక్షయ్ గురించి బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ ‘‘అక్షయ్ కుమార్ నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ అతడు ఎలాంటి ఈగో లేని వ్యక్తి. చాలా సరదాగా ఉంటాడు’’ అని చెప్పారు.