రోబో 2.0 లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రోజుకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్న అక్షయ్ మేకప్ వేసుకునేందుకు అక్షయ్ తెగ కష్టపడ్డాట్ట మరి

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడుగా నటిస్తున్న ‘2.0’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ చిత్ర పరిశ్రమలో అక్షయ్‌ నటిస్తున్న తొలి చిత్రమిదే. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటనకు అక్షయ్‌ రజనీ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నాడట.

రోబో 2.0లో నటనకు అక్షయ్ కు రోజుకు రూ. 2 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అక్షయ్‌ ప్రతిరోజు చాలా మేకప్‌ వేసుకోవాల్సి వచ్చిందట. ఇలా ఆయన తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు మేకప్‌ వేసుకోలేదని, ఇందులో అక్షయ్‌ దాదాపు 12 పాత్రల్లో కనిపిస్తారని చెన్నై వర్గాలు చెబుతున్నారు.

2010లో విడుదలైన ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘2.0’లో అమీజాక్సన్‌ కథానాయికగా నటించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.