నందితా శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'అక్షర'. అజయ్ ఘోష్, మధునందన్, షకలక శంకర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

నలుగురు స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటారు. అటువంటి వారి జీవితాల్లోకి అక్షర అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమె కారణంగా నలుగురు స్నేహితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు. పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్తారు

దీంతో ఆమె చంపాలని నిర్ణయించుకుంటారు. టీజర్ చూస్తుంటే థ్రిల్లర్ నేపధ్యంలో సాగే కథగా అనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమాను రూపొందించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.