సూపర్ స్టార్ స్టేటస్ సామాన్యమైనది కాదు. దాన్ని నిలబెట్టుకోవటం కష్టమే.యంగ్ హీరోల్లో ఆ స్టేటస్ అందుకున్నవారు మహేష్ బాబు. ఆయనకు ఉన్న క్రేజే వారు. కుర్రాళ్ల  మొదలుకొని.. ఆ నాటి బామ్మల వరకూ  ఆయనన్నా, అయన నటన అన్నా ప్రాణం పెట్టేస్తారు. తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్.. తెలుగు తెరను ఏలుతున్నారు. అందుకు కారణం ఆయన పెద్ద వాళ్లతో వ్యవహరించే తీరు, సీనియర్స్ కు ఇచ్చే గౌరవం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అంతెందుకు  106  సంవత్సరాలున్న రేలంగి సత్యవతి అనే మామ్మగారు  మహేష్ బాబుపై అభిమానంతో రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వచ్చి ఆయనను కలవటం జరిగింది. ఆమెని ఎంతో అప్యాయంగా రిసీవ్ చేసుకుని, కొత్త బట్టలు పెట్టి, ఫొటోలు దిగి వాటిని మహేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయంపై హీరో సుమంత్ ట్విట్టర్ లో స్పందించాడు. ఈ తరంలో మహేష్ .. తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావుకి ఇష్టమైన నటుడు అని సుమంత్ ట్వీట్  చేశాడు.   వెంటనే ఈ ట్వీట్‌పై మహేష్  బాబు స్పందించాడు. ‘‘థ్యాంక్స్ సుమంత్. ఏఎన్‌ఆర్ గారు ఏన్నో విధాలుగా, ఎప్పటికీ.. నాకు ప్రేరణే’’ అని మహేష్ రిప్లై ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన అక్కినేని అభిమానులు మహేష్ ని మెచ్చుకుంటున్నారు. 

మహేష్ తాజా చిత్రం విషయానికి వస్తే..

‘భరత్‌ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తోన్న చిత్రం మహర్షి.  మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇటీవలె న్యూయార్క్‌ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్‌.  రీసెంట్ గా ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయింది. ప్రత్యేకంగా వేసిన పల్లెటూరి సెట్లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. 

ఈ సెట్‌ రూపొందించడానికి సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేసిందట చిత్ర యూనిట్. ఆర్ట్‌ డైరెక్టర్‌ సునిల్‌ బాబు ఈ భారీ సెట్‌ని అచ్చం పల్లెటూరిని తలపించే విధంగా తీర్చిదిద్దారట. సినిమా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలను ఈ లొకేషన్‌లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారట. 

ఈ షెడ్యూల్‌లో చిత్ర యీనిట్ అంతా పాల్గొననుంది. ఇందులో మహేశ్‌ స్నేహితుడి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ నటిస్తున్నారు. మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: కేయు మోహనన్‌.