నాగార్జున అంత సాహసం చేస్తాడా?

akkineni nageshwar rao biopic on cards
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. 'మహానటి' సినిమా ఇచ్చిన 

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. 'మహానటి' సినిమా ఇచ్చిన స్పూర్తితో ఇప్పుడు మరికొన్ని బయోపిక్ లు చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏఎన్నార్ బయోపిక్ కూడా తెరపైకి వచ్చే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు నాగార్జున కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎన్నార్ జీవితం ఓ అధ్బుతమైన కథ. సాధారణ వ్యక్తి తన స్వయంకృషితో ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాడనే దానికి ఆయన చక్కటి ఉదాహరణ. ఆయన క్యాన్సర్ వచ్చిందనే విషయం తెలియగానే అభిమానులకు ఆ విషయాన్ని చెప్పి వాళ్లకు ముందే తను ఎక్కువ రోజులు బ్రతికి ఉండనని చెప్పారు.

చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ ను తీస్తే బావుంటుందనే ఆలోచనతో నాగార్జును దీనికి పూనుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి కొందరు రచయితలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి నాగార్జున ఎంతవరకు ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకువస్తాడో చూడాలి!

loader