ఏ సినిమా అయినా సరే సంక్రాంతి భరిలో నిలిస్తే మినిమమ్ వసూళ్లను రాబడుతుంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా పొంగల్ భరిలో నిలిస్తే అన్ని సినిమాలపై ఆడియెన్స్ ఓ లుక్కేస్తారు. పాజిటివ్ టాక్ వస్తే రెండు మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ అందుతాయి. 

అయితే వచ్చే సంక్రాంతికి అక్కినేని హీరోల సినిమాలు సంక్రాంతి ఫైట్ లో పోటీ పడనున్నట్లు టాక్ వస్తోంది. నాగార్జున - నాగ చైతన్య కొత్త సినిమాలు నెక్స్ట్ సంక్రాంతికి రెండు రోజుల గ్యాప్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య - శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్ స్టోరీ సెప్టెంబర్ లో మొదలుకానుంది. ఆ సినిమా పనులన్నిటినీ డిసెంబర్ మొదటివారానికి పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని నిర్మాత సునీల్ నారంగ్ ఆలోచిస్తున్నారట. 

ఇక నాగార్జున బంగార్రాజు కూడా అదే సమయంలో రానుంది. ఈ క్లాష్ అక్కినేని అభిమానులను కొంత కలవరపరిచే విషయమే అయినప్పటికీ సంక్రాంతికి మంచి టాక్ వస్తే ఇద్దరు హీరోలు సక్సెస్ ను ఎంజాయ్ చేయవచ్చు. మరి అక్కినేని హీరోలు ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.