ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలదంరూ దూకుడుతో వ్యవహరిస్తుంటే అక్కినేని అఖిల్ మాత్రం రేసులో వెనుకబడ్డాడు. అఖిల్ గనుక జోరు పెంచకపోతే పోటీ తట్టుకోవడం కష్టమని అంటున్నారు.

'అఖిల్' సినిమాతో హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే నిరాశ పరిచాడు. ఆ తరువాత తీసిన 'హలో' కి పాజిటివ్ టాక్ వచ్చినా కాస్ట్  ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో చాలా గ్యాప్ తీసుకొని వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటిస్తున్నాడు.

అది కూడా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఈ ఏడాది అఖిల్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. పైగా ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.. లేదంటే జనాలకు గుర్తుండరు.

ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువవ్వడం, కొందరు మినిమమ్ గ్యారంటీ మార్కెట్ తెచ్చుకోవడంతో అఖిల్ జోరు పెంచి హిట్లు ఇస్తేనే కానీ హీరోగా నిలబడడం కష్టమనిపిస్తోంది. ఇప్పటికైనా స్పీడ్ పెంచి ఏడాదికి రెండు సినిమాలు చొప్పున ప్లాన్ అఖిల్ ప్లాన్ చేసుకుంటే మంచిది.