Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని అఖిల్ సినిమాకు నాగార్జున, అమల పాటే టైటిల్

  • విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అక్కినేని అఖిల్ తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్
  • అమల, నాగార్జునల సూపర్ హిట్ మూవీ నిర్ణయం సినిమా పాటే టైటిల్
  • హలో గురూ ప్రేమ కోసమే..టైటిల్ ఓకే చేసిన నాగార్జున
akkineni akhil next movie title confirmed as hello guru prema kosameraa

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుంచిన తొలి సినిమా "అఖిల్" భారీ డిజాస్టర్ అయింది. దీంతో రెండో ప్రాజెక్టు పై చాలా కేర్ తీసుకున్నారు అక్కినేని నాగార్జున. అఖిల్ రెండవ సినిమా కోసం 16 నెలలు తీసుకున్నాడు. అఖిల్ కు మంచి కథను ఎంచుకోవడం కోసమే ఇంత సమయం పట్టిందని నాగార్జున అన్నారు.

 

సో అఖిల్‌ రెండవ ప్రాజెక్ట్‌ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. చాన్నాళ్ల పాటు సరైన దర్శకుడి కోసం ఎదురుచూసిన అఖిల్‌ ఎట్టకేలకు 'మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ ను సెలెక్ట్‌ చేసుకున్నాడు. అయితే విక్రమ్ చెప్పిన మొదటి స్క్రిప్ట్ అంతగా నచ్చకపోవడంతో నాగార్జున మరొక స్క్రిప్ట్ రెడీ చేయమని కోరగా విక్రమ్‌ కుమార్‌ రెండవ స్క్రిప్ట్ కూడా వినిపించాడు. అది నచ్చడంతో దాన్ని ఫైనల్‌ చేశారు నాగార్జున. అన్ని ఓకే అనుకున్నాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 

ఈ సినిమాకి తొలుత 'జున్ను' .. 'ఎక్కడ ఎక్కడ వుందో తారక' .. 'హలో గురు ప్రేమ కోసమే' అనే టైటిల్స్ పరిశీలించారు. అయితే, ఫైనల్ గా... అఖిల్‌ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన 'నిర్ణయం'లో సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'హలో గురూ ప్రేమ కోసమేరా ఈ జీవితం..' పాటలో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్‌ చేశారట. హలో గురూ ప్రేమ కోసమే..చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌లో రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరిస్తారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరోపై ఫైట్స్‌ తీశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

 

అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ నెలకొంది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున.

Follow Us:
Download App:
  • android
  • ios