అక్కినేని అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది.

ఈ సందర్భంలో హీరో అఖిల్.. సంగీత దర్శకుడు తమన్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాకి పని చేసిన వారందరూ యంగ్ కావడంతో షూటింగ్ సమయంలో అంతా ఫ్యామిలీలా కలిసిపోయామని చెప్పిన అఖిల్.. తమన్ కూడా యంగ్ అనుకున్నామని కానీ అతడి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించాడు.

అయినా.. తమన్ చిన్నపిల్లాడిలా అందరితో కలిసిపోయాడని చెప్పిన అఖిల్.. తమన్ కి క్రికెట్ అంటే ప్రాణమని అందుకే మిస్టర్ మజ్ను ట్యూన్లు త్వరగా ఇచ్చేందుకు ఒక బ్యాట్ ని లంచంగా ఇచ్చానని తెలిపాడు.

అది మామూలు బ్యాట్ కాదట.. ప్రముఖ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వాడిన బ్యాట్. మొత్తానికి అఖిల్ కి ఎవరితో ఎలా పని చేయించుకోవాలో బాగా తెలిసినట్లుంది.