Asianet News TeluguAsianet News Telugu

 ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు బే

 ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు బే అనగా.. సాలే చెప్పు అంటూ మళ్లీ గట్టిగా కొడతారు..

Akkineni Akhil  agent release date fixed
Author
First Published Feb 4, 2023, 5:38 PM IST

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పండగకు వరస సినిమాలు విడుదల అవుతుండటంతో  ఈ చిత్రం రిలీజ్ కాలేదు. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తాజాగా మేకర్స్ తెలిపారు. ‘ఏజెంట్‌’ విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 

ఈ వీడియోలో ... అఖిల్‌ను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. చేతులు, కాళ్లు కట్టేసి.. ముఖానికి మాస్క్‌ తొడిగి చిత్రహింసలకు గురిచేస్తుంటారు. నిన్ను ఎవరు పంపారు, పోలీసా, రా(RAW) నా.. ఈ నెట్వర్క్‌లోకి ఎవరు పంపారు సాలే.. చెప్పు అంటూ ఓ వ్యక్తి అఖిల్‌ను కొడుతుంటాడు. ఇందుకు అఖిల్ ఇంటెన్స్ టోన్‌లో ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు బే అనగా.. సాలే చెప్పు అంటూ మళ్లీ గట్టిగా కొడతారు.. సాలే నహీం.. వైల్డ్ సాలే బోల్ అంటూ అఖిల్ డైలాగ్‌ చెప్పాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అఖిల్ మేకోవర్ మార్చుకున్నాడు. యాక్టింగ్  పరిణితి, యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్‌ కనపడుతోంది. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోయిన్‌గా కూడా ఆమెకు ఇదే మొదటి చిత్రం. 

అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) లో చివరగా కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘ఏజెంట్’ ను పట్టాలెక్కించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios