అఖిల్ అక్కినేని మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రియా భూపాల్ పెళ్ళయిపోయింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమడు అనిందిత్ రెడ్డితో ప్యారిస్ లో ఆమె వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్ కి రాం చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు.ఉపాసన కజిన్ అయిన అనిందిత్ రెడ్డితో శ్రియా భూపాల్ నిశ్చితార్థం గత ఫిబ్రవరిలో జరిగింది. కాగా ..ప్యారిస్ లో జరిగిన ఈ పెళ్లి పూర్తి ప్రైవేటు తంతులా సాగింది. ఈ వెడ్డింగ్ కి కేవలం కుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.