అఖిల్ హీరోగా కెరీర్ మొదలెట్టినాటి నుంచి చెప్పుకోవటానికి ఒక్క హిట్టూ లేదు. చూస్తూంటే సుమంత్ లాగ అయ్యిపోతాడని కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే సుమంత్ ఉన్నప్పటి పరిస్దితులు వేరు. సరైన డైరక్టర్స్ తో అతను ముందుకు వెళ్లలేదు. రామ్ గోపాల్ వర్మ వంటి డైరక్టర్ తో లాంచింగ్ అయితే ఘనంగా చేసారు కానీ తర్వాత పట్టించుకున్నవాళ్లే లేరున్నట్లుగా సాగుతోంది. ఆ పరిస్దితి అఖిల్ కు రాకూడదని నాగ్ ఆలోచిస్తున్నారు. అతని కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారు.
 
త్వరలో  అఖిల్‌ నాల్గవ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అఖిల్‌ 5వ సినిమాగా ఏజెంట్‌ ను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు. బ్యాచిలర్ ఈ ఏడాది వచ్చినా,సురేంద్రరెడ్డి సినిమా మాత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉంది. మరి ఆ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో చేయబోతున్నారనేది ఫిక్స్ అయ్యిపోయిందిట.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...అఖిల్‌ ఆరవ సినిమాకు గాను కొరటాల శివ ను రంగంలోకి దించేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ వినిపస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో మూవీ పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత అఖిల్‌ తో సినిమాను స్టార్ట్ చేసేందుకు స్క్రిప్టు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే...అక్కినేని అఖిల్‌, కొరటాల శివల మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే అవకాశం ఉంది.