అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ కోరుకునే యాక్షన్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు దక్కలేదు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ కోరుకునే యాక్షన్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు దక్కలేదు. ఆ కోరిక సురేందర్ రెడ్డి ద్వారా తీరుతుంది అని అఖిల్ బోలెడు ఆశలతో ఉన్నాడు.
ఇప్పటికే ఏజెంట్ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చివరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఎట్టకేలకు ఏజెంట్ ప్రచార కార్యక్రమాలు గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయ్యాయి.
ఈ చిత్రం కోసం అఖిల్ తీవ్రంగా శ్రమించాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం అంతే కమిట్మెంట్ తో ఉన్నాడు. తాజాగా ఏజెంట్ మూవీ ప్రచారం కోసం అఖిల్ చేసిన రిస్కీ స్టంట్ ఫ్యాన్స్ లో హార్ట్ బీట్ పెంచేసింది. అఖిల్ చేసిన వైల్డ్ స్టంట్ అంటూ చిత్ర యూనిట్ వీడియో పోస్ట్ చేసింది. అఖిల్ విజయవాడ లోని పివిపి మాల్ లో 172 అడుగుల ఎత్తు నుంచి వేలాడుతూ కిందిగి దిగాడు.
ఏజెంట్ టీజర్ లో చూపిన విధంగా గుండెలు బాదుకుంటూ అభిమానులని ఉత్సాహ పరుస్తూ అఖిల్ చేసిన ఈ స్టంట్ వైరల్ గా మారింది. తన సినిమా కోసం అఖిల్ ప్రాణం పెట్టేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
అఖిల్ ఈ చిత్రంలో కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 28న అఖిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
