అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో అనౌన్స్ చేశాడు. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అంతకుమించి ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఈ విషయంలో అఖిల్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర విషయాల్లో కూడా అఖిల్ గీతాఆర్ట్స్ సంస్థ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ని కన్ఫర్మ్ చేయలేదు. కొత్త అమ్మాయిని తీసుకోవాలా..? కాస్త నోటెడ్ ఫేస్ ఉన్న అమ్మాయిని తీసుకోవాలనే విషయంలో ఇంకా స్పష్టతకి రాలేదు.

హీరోయిన్ సంగతి పక్కన పెడితే సినిమాటోగ్రాఫర్ ని ఫైనల్ చేయలేదు. రెండు, మూడు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ దర్శకుడు భాస్కర్, నిర్మాత బన్నీ వాసు ఈ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదట. గీతాఆర్ట్స్ సంస్థ సాయి ధరం తేజ్ తో చేస్తోన్న సినిమా విషయంలో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది.

సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. కానీ అఖిల్ సినిమా మాత్రం ఓపెనింగ్ తోనే ఆగిపోయింది. సాయి ధరం తేజ్ సినిమా చాలా వరకు పూర్తయితే తప్ప అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లదనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలా చూసుకుంటే అఖిల్ సినిమా ఈ ఏడాదిలో రావడమే కష్టమనే చెప్పాలి!