అక్కినేని అఖిల్ ఫ్యూచర్ ఏమిటో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. కథలు చెప్పడానికి దర్శకులు చాలా మంది వస్తున్నారు. కానీ ఏ సినిమా చేసినా ఆడియెన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదు. ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఎవరు ఊహించని విధంగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు. 

ఆ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులవుతోంది. అయితే హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయకపోవడం గమనార్హం. స్క్రిప్ట్ నచ్చక కొంతమంది నో చెబుతుంటే మరికొంత మంది ఈ ప్లాప్ కాంబోపై అనుమానంతో చేయలేమని వెనుదిరుగుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అఖిల్ ఫైనల్ గా మళ్ళీ అన్న నాగచైతన్యతో నటించిన హీరోయిన్ నే ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. 

చాలా మంది హీరోయిన్స్ ని సెర్చ్ చేసి అలసిపోయిన చిత్ర యూనిట్ కి పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఈ బ్యూటీ చైతు ఒక లైలా కోసం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అఖిల్ తో కూడా నటించేందుకు ఒపుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ కు ఆమె ఎంతవరకు సెట్టవుతుందో చూడాలి.