తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన అక్కినేని అఖిల్ వీడెవడు అంటూ ఓ సస్పెన్స్ పోస్టర్ ట్వీట్ చేసిన అఖిల్ పోస్టర్ లో ఉన్నది ఎవరో గెస్ చేయండంటూ ఫ్సాన్స్ కు సవాల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని తాజా ట్వీట్ అందరినీ సస్పెన్స్ లో పడేస్తోంది. వీడెవడు? అంటూ ఓ పోస్టర్ ను అఖిల్ షేర్ చేసారు. అయితే అందులో హీరో వెనుక వైపు మాత్రమే కనిపిస్తోంది. వీడెవడో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే... ఈ లోగా వీడెవడో కనుక్కోండి చూద్దాం... అంటూ కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు అఖిల్.

పరికించి చూస్తే... అఖిల్ షేర్ చేసిన 'వీడెవడు?' పోస్టర్లో ఉన్నది హీరో నితిన్ అని తెలుస్తోంది. ట్విట్టర్ లో ఇది నా టీమ్ మేట్ పోస్టర్ అంటూ అఖిల్ క్లూ కూడా ఇచ్చాడు. అనుకున్నది నిజమైతే... హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నిఖిల్ పాతబస్తీకి చెందిన కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ గత సినిమాలకు భిన్నంగా గడ్డంతో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు లీకైన ఫోటోలకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన స్టైలీష్ విలన్ గా కనిపించనున్నాడు.

ఆ పోస్టర్లో ఉన్నది నితినే అనుకుంటున్నప్పటికీ...... అఖిల్ ట్వీట్లో సస్పెన్స్ వీడి, అసలు విషయం తెలియాలంటే ఫిబ్రవరి 14న వరకు ఆగాల్సిందే.