అతనికి సిద్ధాంతం తెలియదు. అంటే ఇక్కడా ఏజెంట్ కు తన రా గురించి తెలియదు. అసలు టైటిల్ కు తగ్గట్టుగా ఈ హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో అయితే మచ్చుకు కూడా కనిపించలేదు.


వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అఖిల్‌కు మాత్రం సరైన హిట్ దక్కడం లేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు విజయం సాధించినప్పటికీ.. చెప్పుకోగదగ్గ స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం అఖిల్‌ ఖాతాలో పడలేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా వున్నారు అఖిల్. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఇందులో ఆయన గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం తనను తాను మార్చుకున్నారు అఖిల్. ఈ సినిమాలో బాడీ, హెయిర్ కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన కష్టం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తేలనుంది. ఇక ఈ ‘ఏజెంట్’చిత్రంలో అఖిల్ క్యారక్టరైజేషన్ విషయానికి వస్తే...

ఏజెంట్ అనే టైటిల్ ను బట్టే ఇదో స్పై థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. సాధారణంగా స్పై థ్రిల్లర్స్ లో హీరో మాగ్జిమం చాలా సీరియస్ గా ఉంటాడు. అతనికి అసమాన ప్రతిభ ఉంటుంది. స్టంట్స్ నుంచి లాంగ్వేజెస్ వరకూ ఏదైనా మ్యానేజ్ చేయగలడు. అఫ్ కోర్స్ రొమాన్స్ లోనూ పట్టు ఉంటుంది. నాటి జేమ్స్ బాండ్ నుంచి రీసెంట్ గా తెలుగులో వచ్చిన గూఢచారి వరకూ ఇదే కనిపించింది. అయితే అందుకు భిన్నంగా ఉంటాడు ఈ ఏజెంట్. ‘రా’లో పనిచేసే ఓ ఆఫీసర్.. దేశంలోనే అత్యంత పెద్దదైన మాఫియా ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వల్ల కాక ఓ పిల్ల హీరోను పంపిస్తాడు. ఆ పిల్ల హీరోనే ఏజెంట్. 

అయితే అతన్ని పవర్ ఫుల్ ఏజెంట్ గా కాక ఓ కోతిలాంటి వాడు అనే పంపుతారు. అతని క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రేసుగుర్రంలో అల్లు అర్జున్ తరహా లో ఉండబోతోందని తెలుస్తోంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగి రాగలిగేది కోతి మాత్రమే’ అనే పాయింట్ ఆధారంగా డిజైన్ చేసారు. ఈ క్యారక్టరైజేషన్ ప్రకారం హీరో అన్నీ కోతి వేషాలు వేస్తాడు. ఏ మాత్రం సీరియస్ నెస్ ఉండదు. పైగా అతనికి గన్స్ అంటే ఇష్టం. సిందూరంలో రవితేజ కూడా ఇలా గన్స్ పిచ్చితోనే నక్సలైట్స్ లోకి వెళతాడు. కానీ అతనికి సిద్ధాంతం తెలియదు. అంటే ఇక్కడా ఏజెంట్ కు తన రా గురించి తెలియదు. అసలు టైటిల్ కు తగ్గట్టుగా ఈ హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో అయితే మచ్చుకు కూడా కనిపించలేదు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.