ప్లేబాయ్‌గా మారనున్న అఖిల్!

First Published 22, Jun 2018, 10:43 AM IST
Akhil Third Movie Shooting Started
Highlights

అక్కినేని వారసుడు అఖిల్ త్వరలోనే ప్లేబాయ్‌గా కనిపించబోతున్నాడు. 

అక్కినేని వారసుడు అఖిల్ త్వరలోనే ప్లేబాయ్‌గా కనిపించబోతున్నాడు. అఖిల్, హలో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచిన అఖిల్ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ప్రేక్షకులను మెప్పించేలా మూడో సినిమాకు సిద్ధమైపోయాడు.  'తొలిప్రేమ' ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బీవీఎస్‌యన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతాన్ని తమన్‌ అందించనున్నారు. ఇదొక ప్రేమ కథా చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యూకేలో షూటింగ్ ప్రారంభమైంది.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వస్తున్న ఈ 25వ సినిమాలో నటిచండం తనకెంతో ఆనందంగా ఉందని అఖిల్ చెప్పారు. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువాలని భావిస్తున్నారు.

loader