మూవీ ఫ్లాప్ బాధ్యత నాదే-అఖిల్

First Published 27, Dec 2017, 7:15 PM IST
akhil takes responsibility for movie flop
Highlights
  • అఖిల్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన అక్కినేని అఖిల్
  • తొలి సినిమాకు ఫ్లాప్ టాక్ రావటంతో చాలాకాలం ఆందోళన చెందిన అఖిల్
  • హలో కథ విన్నాక సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం కలిగి చేశానన్న అఖిల్
  • ఆ సినిమా ఫ్లాప్ కు పూర్తి బాధ్యత తనదేనన్న అఖిల్

 

అక్కినేని అఖిల్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చిత్రం `అఖిల్` డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రెండో సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్న నాగార్జున - అఖిల్ లు హలో చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. హలో చిత్రం సక్సెస్ తో ఊపిరిపీల్చుకున్న అఖిల్.. తన మొదటి చిత్రం అఖిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

అఖిల్ సినిమా ప్లాప్ అయిన సందర్భంలో తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని, సినిమా కు ప్లాప్ టాక్ రావడంతో కొద్ది రోజుల వరకు అసలు బయటకు రాలేదని - ఎవరినీ కలవలేదని చెప్పాడు. ఆ సినిమాను దాదాపు 30 సార్లు చూశానని, లోపం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఆ సినిమా ఘోర పరాజయం పాలైందని అంగీకరిస్తున్నానని అఖిల్ చెప్పాడు. ఆ సినిమా కథను తాను ఒక్కడినే విని ఫైనల్ చేసినందున తన తండ్రి నాగార్జునకు అఖిల్ ఫ్లాప్ తో ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఆ చిత్ర పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పాడు.

 

తన రెండో సినిమా హలో కథను విక్రమ్ చెప్పిన తర్వాత తాను చాలా రిలాక్స్ అయ్యానని, ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని తనకు అపుడే నమ్మకం కలిగిందని అన్నాడు. హలో సినిమాను కూడా రాబోయే పది రోజుల్లో చాలా సార్లు చూస్తానని, ఒక నటుడిగా ఇంకా బెటర్ గా ఎలా పెర్ ఫార్మ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నాడు.

 

ఎంసీఏ కు తన సినిమాకు అస్సలు పోలిక లేదని, అయితే ఎంసీఏ తో క్లాష్ వల్ల హలో కలెక్షన్లు కొద్దిగా తగ్గాయని చెప్పాడు. కలెక్షన్లు, కమర్షియల్ విజయం కన్నా ఒక మంచి సినిమా చేశానన్న ఆనందం ఉందన్నాడు. ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరించడం సంతోషకరమన్నాడు.

 

ఇక తదుపరి చిత్రానికి సంబంధించి రెండు కథలు విన్నానని వాటిలో ఒక దాన్ని జనవరి 10న ఫైనల్ చేసి అనౌన్స్ మెంట్ చేస్తానని చెప్పాడు. తన తర్వాతి చిత్ర  షూటింగ్ కూడా వెంటనే మొదలు పెడతానని చెప్పాడు. ఆ చిత్రాన్ని వేరే నిర్మాణ సంస్థలో చేయబోతున్నానని అన్నాడు.

loader