అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్ మెంట్ రద్దు?

akhil shriya bhupal engagement called off
Highlights

  • అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, కాబోయే కోడలు శ్రియా భూపాల్ ఎంగేజ్ మెంట్ రద్దు
  • రద్దుకు నిర్ణయం తీసుకున్న యువ జంట అఖిల్, శ్రియా భూపాల్
  • రోమ్ లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న అఖిల్,శ్రియా
  • కానీ రద్దు నిర్ణయంతో అభిమానులందర్నీ షాక్ కు గురిచేసిన అక్కినేని ఫ్యామిలీ

 

అక్కినేని నాగార్జున కుమారుడు, యంగ్ హీరో అఖిల్ నిశ్చితార్థం శ్రియాభూపాల్‌తో ఇటీవలే ఘనంగా జరిగింది. అయితే అఖిల్, జీవీకే రెడ్డి మనువరాలు శ్రియ ఇకపై రిలేషన్ కొనసాగించేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొన్ని రోజుల్లో రోమ్ లో వివాహం నిశ్చయం చేసుకున్న ఇద్దరూ ఇక తమ రిలేషన్ షిప్ కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. 

 

వీరి వివాహం క్యాన్సిల్ అయిందనే సంచలన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఇటు నాగార్జున, అటు జీవీకే కుటుంబ పెద్దలు ఇద్దరికీ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అవి విఫలయత్నాలుగానే మిగిలాయని తెలుస్తోంది. గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న ఇద్దరికీ 2016 డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగింది.

 

పెళ్లి ఎందుకు రద్దు అయిందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే అఖిల్, శ్రియాల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే కారణమని కొందరు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని... అయినా ఫలితం లేకపోవడంతో, మ్యారేజ్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. పెళ్లి నేపథ్యంలో, హోటళ్లు, రిసార్టులు బుక్ చేయడం కూడా అయిపోయింది.

ఇక ఇప్పటికే ఇటు నాగార్జున, అటు జీవీకే కుటుంబ సభ్యులు ఆహ్వానితులకు హోటల్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ రద్దు చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. గత వారం కూడా అంతా సవ్యంగానే ఉన్నా... ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వారు చెబుతున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఉటంకించింది.

 

రోమ్ లో దాదాపు 700 మంది తెలుగు, తమిళ , బాలీవుడ్ సినీ రాజకీయ ప్రముఖుల నడుమ వీరి వివాహం జరగాల్సింది. ఇటీవలే జరిగిన నాగచైతన్య, సమంతల ఎంగేజ్ మెంట్ కు కూడా ఇరు ఫ్యామిలీలు హాజరయ్యాయి. చివరకు ఈ వేడుక ఓ షాకింగ్  న్యూస్ తో ముగిసింది. 

అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇరు కుటుంబాలూ ప్రకటించకపోవడం గమనార్హం.

loader