అక్కినేని అఖిల్ నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ కుర్ర హీరో 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ని ఖరారు చేశారు. అయితే అఖిల్ సినిమాల్లో మాత్రమే హీరో కాదని రియల్ లైఫ్ లో కూడా హీరో అంటూ పొగిడేస్తుంది నటి నిధి అగర్వాల్. అఖిల్ నటిస్తోన్న 'మిస్టర్ మజ్ను'లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ.

సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో సడెన్ గా ఓ లైట్ హీరోయిన్ ముఖం మీద పడబోయిందట. అది గమనించిన అఖిల్ కొన్ని సెకన్లలో ఆ లైట్ ని పట్టుకొని హీరోయిన్ ని కాపాడట.

ఈ విషయాన్ని వెల్లడించిన నిధి అగర్వాల్.. అఖిల్ లేకపోతే తన ముఖంపై బలమైన గాయాలు తగిలి ఉండేవని తెలిపింది. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.