అఖిల్ నిజంగానే కూరలో కరివేపాకు అయ్యాడుగా? మీమ్స్ వైరల్
ఈ మొత్తం ఎపిసోడ్, మొత్తం షోలో బకరా అయ్యింది మాత్రం అఖిలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు మాదిరిగానే అఖిల్ మిగిలారు. తన ఎలిమినేషన్ జరిగినప్పుడు కుమార్ సాయి కరివేపాకు ఎవరు అన్నప్పుడు అఖిల్ పేరు సూచించారు.
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రారంభం నుంచి విమర్శలు ఎదుర్కొన్న బిగ్‌బాస్ షో చివరికి ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చింది. గతంతో పోలిస్తే పేలవంగా ఉందనే టాక్ వినిపించింది. కంటెస్టెంట్లలో చాలా మంది ముక్కుమొఖం తెలియనివారే ఉంటున్నారని కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలోనూ విమర్శలు వచ్చాయి.
కుమార్ సాయి ఎలిమినేట్ అయినప్పుడు, అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్‌లో, అలాగే అవినాష్ ఎలిమినేషన్, లాస్య వంటి వారు ఎలిమినేషన్ సమయంలో బిగ్‌బాస్‌పై, నిర్వహకులపై, హోస్ట్ నాగార్జునపై సోషల్ మీడియా వేదికంగా సెటైర్లు వేశారు. అన్యాయం జరుగుతుందని కామెంట్ చేశారు. మోనాల్‌ని 14వ వారం వరకు ఉంచడం కూడా అనేక విమర్శలకు కారణమైంది.
ఫైనల్‌లో సోహైల్‌కి 25 లక్షలు ఇవ్వడంతోపాటు నాగార్జున పది లక్షలు ఇస్తానని తెలిపాడు. మరోవైపు చిరంజీవి కూడా తాను ఇవ్వాల్సిన ఎన్జీఓకి పది లక్షలు ఇస్తానని మెహబూబ్‌లకు ఇచ్చాడు. గ్రాండ్ ఫినాలెలో ఎక్కువగా సోహైల్, మెహబూబ్, అవినాష్, మోనాల్, దివి, అరియానా, హారికల గురించి మాట్లాడాడు. కానీ అఖిల్ సార్థక్ ని హైలైట్ చేయలేకపోయాడు. ప్రధానంగా చర్చ మొత్తం సోహైల్ చుట్టూనే తిరిగింది. ఇక విన్నర్‌గా అభిజిత్ ఎంతో కొంత అటెన్షన్ కొట్టేశాడు.
ఈ మొత్తం ఎపిసోడ్, మొత్తం షోలో బకరా అయ్యింది మాత్రం అఖిలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు మాదిరిగానే అఖిల్ మిగిలారు. తన ఎలిమినేషన్ జరిగినప్పుడు కుమార్ సాయి కరివేపాకు ఎవరు అన్నప్పుడు అఖిల్ పేరు సూచించారు. దీనికిగానూ అఖిల్.. కుమార్ సాయిపై పంచ్ కూడా వేశాడు. కానీ ఇప్పుడు అంతిమ ఫలితాలు చూస్తే కుమార్ సాయి చెప్పిందే నిజమైందని తెలుస్తుంది.
ఎంతో కష్టపడి గేమ్ ఆడాడు అఖిల్ సార్థక్. మోనాల్‌తో ప్రేమ వ్యవహారాలు మరింత పడ్డాయి. రియల్ లవ్ స్టోరీని తలపించింది. ప్రతి రోజు ఎపిసోడ్ అఖిల్, మోనాల్ ల గురించే చర్చ జరిగేది. హౌజ్‌లో వారినే ఎక్కువగా చూపించేవారు. చివరికి ఏం లేక సింగిల్‌గా రన్నరప్‌గా మిగిలిపోయాడు అఖిల్. టాప్ 3లో ఉన్నప్పుడు సోహైల్ రూ.25లక్షలు తీసుకుని సైలెంట్‌గా జారుకున్నారు. సేఫ్ గేమ్ ఆడాడు. కానీ అఖిల్ విజయంపై నమ్మకంతో వెయిట్ చేసి బకరాగా మిగిలిపోయాడు. దీంతో అఖిల్ కరివేపాకులాగానే మిగిలాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోహైల్ లాగా ఆఫర్ లేదు, విన్నర్‌లాగా ట్రోఫీ లేదు. చివరికి మిగిలించి ఒట్టి చేతులే అనే కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు సోషల్ మీడియాలో అఖిల్‌పై మీమ్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి హల్‌చల్ చేస్తున్నాయి.