బిగ్ బాస్ సీజన్ 4లో ప్రేమ జంటగా ఫేమస్ అయ్యారు అఖిల్-మోనాల్. గత సీజన్స్ లో ఎన్నడూ లేని విధంగా వీరి బంధం సాగింది. ఎప్పుడూ హౌస్ లో వీరిద్దరు మాత్రమే కలిసి ఉండే వారు. నామినేషన్స్ విషయంలో కానీ, టాస్క్ ల విషయంలో కానీ మోనాల్ కి అఖిల్, అఖిల్ కి మోనాల్ మద్దతు ఉండేది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చే వీకెండ్ రెండు రోజులలో కూడా ఒకే కలర్ కలిగిన డ్రెస్ లు ధరించి తమ ప్రేమను చాటుకున్నారు. 
 
బిగ్ బాస్ హౌస్ లో 14వారాలు మోనాల్ కొనసాగగా... అఖిల్, మోనాల్ మధ్య ఘాడమైన ప్రేమ బంధం నడిచింది. ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య కోపాలు, అలగడాలు, ఆనందాలు అన్నీ ఉండేవి. ఫైనల్ గా నిన్న మోనాల్ హౌస్ నుండి ఎలిమినేటై వెళ్లిపోగా అఖిల్ షాక్ లోకి వెళ్ళాడు. ఆ విషయాన్ని అతను డైజెస్ట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఐతే మోనాల్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపించారు. ఆమె ఆనందంగానే హౌస్ ని వీడడం జరిగింది. 
 
మోనాల్ హౌస్ నుండి వేదిక పైకి వెళ్లిన తరువాత కూడా అఖిల్, మోనాల్ తమ ఎమోషన్స్ దాచుకోలేకపోయారు. వారం రోజుల తర్వాత, నీతో వచ్చి అన్ని విషయాలు మాట్లాడతానని అఖిల్ ఆమెతో చెప్పాడు. ఇక నేడు ఉదయం మోనాల్ లేని లోటు అఖిల్ బాగా ఫీలయ్యాడు. మనతో మాట్లాడకపోయినా నచ్చిన వాళ్ళు దగ్గర ఉంటే... ఆ ఫీల్ వేరని అతను అన్నాడు. మోనాల్ ని బాగా మిస్ అవుతున్నట్లు నాకు అర్థం అవుతుందని హారిక అంది. అలాగే మోనాల్ నువ్వు బయటికి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉంటుందని హారిక అంది. దానికి సమాధానంగా అఖిల్ ... అవును నేను అదే చెప్పాను అని అఖిల్ అనడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అఖిల్ చెప్పినట్లు వారం రోజులు మోనాల్ హైదరాబాద్ లో ఉంటుందో లేదో చూడాలి.