అఖిల్ కు తొలి రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ కాబోతోన్న మూడో సినిమా మిస్టర్ మజ్ను బిజినెస్ పై ఆ ప్రభావం పడుతుంది. దానికి తోడు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూత్ లోకి పెద్దగా వెళ్లలేదు. ఆ ఎఫెక్టూ ఉంటుంది. ఈ విషయం నిర్మాతలకూ తెలుసు. ఇవన్నీ ఆలోచించే ఆచి,తూచి డబ్బు ఖర్చు పెట్టినట్లు సమాచారం.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏ స్దాయి బిజినెస్ జరుపుకుంది, ఎంత వస్తే హిట్ జోన్ లో పడతారనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు  `మిస్టర్ మజ్ను` ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.   అంటే మినిమం 25 కోట్లు మేరకు అయినా కలెక్షన్స్ వస్తే ఒడ్డున పడి, హిట్ కొట్టినట్లు. 

ప్రీ రిలీజ్ బిజినెస్ ...(ఏరియా వైజ్)  

నైజాం......................రూ.6కోట్లు (అడ్వాన్స్) 

సీడెడ్......................రూ.2.70కోట్లు (ఎన్ ఆర్ ఏ)

తూ.గో. జిల్లా............ రూ.1.50 కోట్లు (ఎన్ ఆర్ ఏ) 

గుంటూరు................రూ.1.50 కోట్లు (అడ్వాన్స్) 

కృష్ణ.......................రూ.1.35కోట్లు (ఎన్ ఆర్ ఏ) 

ప.గో.జిల్లా..............రూ.1.25కోట్లు (ఎన్ ఆర్ ఏ) 

నెల్లూరు.................రూ.65 లక్షలు (ఎన్ ఆర్ ఏ) 

ఏపీ - నైజాం కలుపుకుని 17.35 కోట్లు

భారత్ లో మిగతా ప్రాంతాల్లో  1.50 కోట్లు

 అమెరికా కలుపుకుని ఓవర్సీస్ లో 3.70 కోట్లు 

అఖిల్‌ అక్కినేని హీరోగా  ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్ మజ్ను’. ఇప్పటికే  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది.  యు/ఎ స‌ర్టిఫికెట్‌ను పొందిన  ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.    శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్ర నిడివి  2గంటల 25 నిమిషాల 6 సెకన్లకు  ఉంది. 

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో జనవరి 24న 174పైగా ధియేటర్లలో విడుదల కాబోతోంది. అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.