ఈ సీజన్ కి బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన సభ్యులలో అఖిల్ ప్రేక్షకులకు కొంచెం ప్రత్యేకం అనిపించాడు. అఖిల్ కామ్ నేచర్...తక్కువగా ఓవర్ రియాక్ట్ కావడం చాల మందికి నచ్చుతుంది. ఇక హీరోయిన్ మోనాల్ తో ఆయన ప్రేమాయణం కూడా అఖిల్ కి  ఇమేజ్ తెచ్చిపెడుతుంది. ఐతే గత ఆదివారం అఖిల్ ఓ విషయంపై స్పందించిన తీరు బిగ్ బాస్ అభిమానులను షాక్ గురి చేసింది. కుమార్ సాయి కి అఖిల్ ఇచ్చిన సమాధానం చాలా పొగరుగా ఉంది. అఖిల్ అన్న మాట విన్న ఆడియన్స్ అఖిల్ కి ఇంత పొగరా అని తిట్టుకుంటున్నారు. 

ఈ వారం ఎలిమినేటైన కుమార్ సాయి బిగ్ బాస్ వేదికపైకి రావడం జరిగింది. ఇక ఇంటి సభ్యులను వాళ్ళ నేచర్ ఆధారంగా కూరగాయలతో పోల్చాలని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఉన్న కూరగాయల నుండి కరివేపాకుతో అఖిల్ ని కుమార్ సాయి పోల్చాడు. కరివేపాకు వలే ఆయన సరైన ఫ్లేవర్ ఇవ్వడం లేదని, టాస్క్ లలో మనసుపెట్టి ఆడడం లేదని అన్నాడు. దీని వలన టాస్క్ లలో అఖిల్ గెలవలేక పోతున్నాడని అన్నాడు. 

ఈ మాటకు సమాధానంగా అఖిల్...నేను గెలవకపోయినా ఇక్కడ ఉన్నాను...గెలిచి కూడా నువ్వు బయట ఉన్నావ్ అని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఎలిమినేటైన సాయి దీనిపై వాదనకు దిగలేదు. సాధారణంగా ఎలిమినేటైన సభ్యుడిపై ప్రేక్షకులలో కొంత సింపథీ ఉంటుంది. అలాంటి సమయంలో ఎలిమినేటైన సభ్యుడు ఓడిపోయావ్ అని అర్థం వచ్చేలా అఖిల్ మాట్లాడిన తీరుకు బిగ్ బాస్ ఆడియన్స్ మండిపడుతున్నారు. 

ఏ విధంగా చూసినా ఇది అఖిల్ కి కొంచెం మైనస్ అని చెప్పాలి. చాలా కాలంగా పాజిటివ్ ఇమేజ్ డెవలప్ చేసుకున్న అఖిల్ ఈ ఒక్క సంఘటనతో   నెగెటివ్ మార్క్స్ తెచ్చుకున్నారని టాక్.ఇక నిన్న నామినేషన్స్ కోసం జరిగిన టాస్క్ లో కూడా అఖిల్ కోసం మోనాల్ త్యాగం చేసి నామినేట్ అయ్యింది. మోనాల్ ని ఎంతో ప్రేమిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న అఖిల్ విషయానికి వచ్చే సరికి చల్లగా జారుకున్నాడని అంటున్నారు.