అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ మొదటి నుంచి వరుసగా మూడు సినిమాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా అఖిల్ తన అయిదవ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అ! సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అఖిల్ తో వర్క్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. అయితే సినిమాలో హీరోయిన్ గా క్యూట్ గర్ల్ నివేత థామస్ నటించనున్నట్లు టాక్ వస్తోంది. స్క్రిప్ట్ విన్న నాగార్జున హీరోయిన్ గా మలయాళం గర్ల్ నివేత అయితేనే బెటర్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

ఇకపోతే రీసెంట్ గా కల్కి సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రశాంత్ అఖిల్ సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సప్సెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉన్న కథ మీద నమ్మకంతో అఖిల్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా షూటింగ్ చివరిలో అఖిల్ తన 5వ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయాలనీ ట్రై చేస్తున్నాడు.