అఖిల్  ఇప్పటి వరకు  నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. డెస్పరేట్ గా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంత పెద్ద డైరక్టర్ తో చేసినా హిట్ అనేది మొహం దాచేసుకుంటోంది.  సినిమాలకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా కలెక్షన్స్ కురవటం లేదు. దాంతో తన తండ్రి నాగార్జున సూచనతో తన నాలుగో సినిమాను అల్లు అరవింద్ ఆధ్వర్యంలో చేయటానికి సిద్దపడ్డారు.  

తెలుగు ప్రేక్ష‌కులు దాదాపు మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ ప్లానింగ్ కాబట్టి ఖచ్చితంగా మంచి కథే ఉంటుంది. సినిమా కూడా బాగుంటుంది అని అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో అఖిల్ తదుపరి చిత్రం కోసం కథలు వింటున్నారు. రీసెంట్ గా రాజశేఖర్ తో కల్కి చిత్రం చేసి రిలీజ్ కోసం చూస్తున్న ప్రశాంత్ వర్మ కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. బౌండెండ్ స్క్రిప్టు రెడీ చేసుకుని రమ్మని ప్రశాంత్ వర్మకు చెప్పారట. నాలుగైదు మీటింగ్ ల తర్వాత ప్రాజెక్టు ఖరారు అయ్యే అవకాసం ఉంది. అన్ని సెట్ అయితే సెప్టెంబర్ నుంచి షూటింగ్, వచ్చే సంవత్సరం రిలీజ్ ఉంటాయి.