కెరీర్ లో పూర్తి డౌన్ ఫాల్ లో ఉన్న అఖిల్ కి ఈ సినిమా అయినా సెట్ అవుతుందా? అసలు జాన్వీ ఒప్పుకుంటుందా చూడాలి. అయ్యగారు ఎప్పటికి ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏజెంట్. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ పై మంచి అనచాలే ఉన్నాయి. మొదటి సారి అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించటంతో పెద్ద హిట్ అవుతుందని భావించారు. మొన్న ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయింది.
అయితే ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు కే తేడా టాక్ వచ్చేసింది. సినిమా మార్నింగ్ షో చూసి చూసిన అభిమానులు, నెటిజన్లు తమ డిజాస్టర్ అని ఫిక్సైపోయారు. నెగిటివ్ రివ్యూలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. ఈ నేపధ్యంలో అఖిల్ తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అఖిల్ ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ సైన్ చేసేసారు.
ఆ చిత్రం టైటిల్ 'థీర' . సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు అసెస్టెంట్ గా ప నిచేసిన అనీల్ కుమార్ ఈ చిత్రం డైరక్ట్ చేయబోతున్నారు. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ గా నిర్మాణం జరగనుంది. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసినట్టు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకురావాలని కూడా భావిస్తున్నారట. కెరీర్ లో పూర్తి డౌన్ ఫాల్ లో ఉన్న అఖిల్ కి ఈ సినిమా అయినా సెట్ అవుతుందా? అసలు జాన్వీ ఒప్పుకుంటుందా చూడాలి. అయ్యగారు ఎప్పటికి ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన 'ఏజెంట్' సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటంతో అఖిల్ చాలా నిరాశలో ఉన్నట్లు చెప్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్, వక్కంతం వంశీ కథపై విమర్శలు రావటం, అఖిల్ బాగా చేసాడనటం ఊరటే. సిక్స్ ప్యాక్ చేసి, హెయిర్ పెంచి అఖిల్ చాలా కష్టపడినప్పటికీ... సరైన ఫలితం దక్కలేదని సానుభూతి చూపెడుతున్నారు. డిజాస్టర్ ఒక వైపు అఖిల్ ని ఇబ్బంది పెడుతుంటే.... మరో వైపు దారుణమైన ట్రోల్స్ అంత కంటే ఎక్కువ బాధను కలిగించేలా ఉన్నాయని చెప్పుకోవాలి. అమల అక్కినేని ట్రోల్స్ మీద రియాక్ట్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ సారి అలాంటివి జరగకుండా చూసుకోవాలని జాగ్రత్తలు తీసుకునే షూట్ మొదలెట్టాలని అఖిల్ నిర్ణయించుకన్నట్లు సమాచారం.
