అక్కినేని యువ హీరో అఖిల్ నాలుగవ సినిమా ఇటీవల పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. భాస్కర్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇంకా పూర్తి నటీనటులు సెట్టవ్వలేదు. ప్రధానంగా హీరోయిన్ సమస్య ఇంకా తీరలేదు. హీరోయిన్ లేకుండానే సినిమాను బాగానే మొదలెట్టారు. 

ఎందుకంటే ఇద్దరి హీరోయిన్స్ కి కథ వినిపించిన భాస్కర్ ఎవరో ఒకరు వస్తారని గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. కానీ మొదటి పూజ హెగ్డేని అనుకోగా ఆమె చర్చల దశలోనే డ్రాప్ అయ్యింది. ఇక గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న ఫైనల్ అయినట్లు టాక్ వస్తోంది. కానీ ఆమె స్క్రిప్ట్ పై కాస్త సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు టాక్. 

గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ ఒక ప్రాజక్ట్ ను పట్టాలెక్కింది అంటే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ అఖిల్ ప్లాప్స్.. పాతబడిన భాస్కర్ ని చూసి నటీమణుల్లో కాస్త అలజడి రేగుతోందట. ఇది ఎంతవరకు నిజమో గాని దాదాపు రశ్మికను ఫైనల్ చేయాలనీ గీతా ఆర్ట్స్ ఒక నిర్ణయనికి వచ్చింది. ఆమె సైన్ చేస్తే షూటింగ్ స్పీడ్ ను కూడా పెంచాలని చూస్తున్నారు. మరి మేడమ్ గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.