తన కెరీర్ ప్రారంభంలోనే వరసగా మూడు ఫ్లాఫ్ లు ఇచ్చిన అఖిల్ కు మీడియాలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన తన తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేస్తున్నారు..ఏ బ్యానర్ నిర్మిస్తోంది వంటి విషయాలు ఎప్పుడూ జనాల్లో నానుతూనే ఉన్నాయి. తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాకు సంభందించి ఓ అప్ డేట్ వచ్చింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..గీతా ఆర్ట్స్ వారు అఖిల్ తర్వాత సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ద్వారా అఖిల్ హిట్ కొట్టాలని నాగ్ భావించి ఈ సెటప్ చేసినట్లు సమాచారం. మీడియా బడ్జెట్ లో మంచి డైరక్టర్ తో ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ చేసి హిట్ కొడదామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారట..

అంతా బాగానే ఉంది ..అఖిల్ ని ఇప్పుడు డైరక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరూ అంటే పరుసరామ్ కానీ బొమ్మరిల్లు భాస్కర్ గానీ కావచ్చు అంటున్నారు. వీరిద్దరు పూర్తి బౌండెడ్ స్క్రిప్టు రెడీ చేసుకుని హీరో కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరు కథలు అఖిల్ విని డిసైడ్ చేసుకోవచ్చని అల్లు అరవింద్ ఓపెన్ ఇచ్చారట. రీసెంట్ గా గీతా గోవిందం వంటి హిట్ ఇచ్చిన పరుశరామ్ ని ఎంచుకుంటారా..తన కెరీర్ లో బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భాస్కర్ వైపు మొగ్గు చూపుతాడా చూడాల్సిందే.