టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తోన్న వారిలో అఖిల్ ముందు వరుసలో ఉన్నాడు. ఇక అఖిల్ మూడవ సినిమా మిస్టర్ మజ్ను టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అఖిల్ - హలో సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న అక్కినేని వారసుడు ఈ సారి కొంచెం డిఫరెంట్ గా రాబోతున్నాడు. 

టీజర్ చూస్తుంటే అఖిల్ కి అన్ని అంశాలు కలిసొచ్చే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఇది వరకే తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అఖిల్ ను ప్లే బాయ్ గా చూపించి మంచి ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాలో మరింత హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. 

డైలాగ్స్ వింటుంటే నవ మన్మథుడిగా రొమాంటిక్ లో తండ్రిని మించిపోతున్నట్లు అఖిల్ కామెంట్స్ అందుకుంటున్నాడు. టీజర్ అయితే బాగానే ఉంది. మరి  ట్రైలర్ తో సినిమాపై ఇంకెంతగా అంచనాలు పెరుగుతాయో చూడాలి. జనవరి 25న సినిమాను రిలీజ్ చేయనున్నారు.