అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ ఎంట్రీపై మొదట్లో అంచనాలు ఎలా ఉండేవో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతని లుక్స్ కి అమ్మాయిలు అప్పుడే ఫిదా అయ్యారు. ఇప్పటికి కూడా అఖిల్ అంటే ప్రేక్షకుల్లో ఒక మంచి భావన ఉంది. అయితే అతను సినిమాతో హిట్టు కొట్టలేకపోతున్నాడు. పూర్తిగా అభిమానులను సంతృప్తి పరచలేకపోతున్నాడు. 

మొదటి సినిమా డిజాస్టర్ ఆ తరువాత సినిమా ప్లాప్ అవ్వడంతో అఖిల్ నెక్స్ట్ సినిమాపై కూడా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. తొలిప్రేమ లాంటి మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ mr.మజ్నుఅనే సినిమా చేస్తున్నాడు. జనవరి చివరి వారంలో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. 

అయితే షూటింగ్ సగం అవ్వగానే ఏ సినిమా అయినా శాటిలైట్ రైట్స్ ద్వారా మొదటి ఆదాయాన్ని అందుకుంటుంది. కానీ అఖిల్ మిస్టర్ మజ్ను ని ఇప్పుడు ఏ టీవీ ఛానెల్ కొనడానికి ఆసక్తి చూపడం లేదట. ఎందుకంటే నిర్మాత చెప్పిన రేట్ కు టీవీ ఛానెల్స్ అనుకుంటున్న ప్రైజ్ కు అసలు మ్యాచ్ కావడం లేదట. 

ఎక్కువ స్థాయిలో అఖిల్ సినిమాను కొనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. ఇక నిర్మాత రెండు ప్రముఖ ఛానెల్స్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. గత చిత్రాల ఫలితాలే అఖిల్ సినిమాకు ఎఫెక్ట్ గా మారింది. మరి మిస్టర్ మజ్నుతో అక్కినేని హీరో ఏం చేస్తాడో చూడాలి.